గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపులి ఉంది జాగ్రత్త !

52 నిమిషాల క్రితం

tiger
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 06:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -గంగవరం (పోలవరం జిల్లా): పోలవరం జిల్లా గంగవరం మండలం ఎండపల్లి పంచాయతీ పరిధి ఇ.రామవరం గ్రామ సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. అడ్డపల్లి–ఎండపల్లి మధ్య ప్రాంతంలో మంగళవారం రాత్రి ఓ ఆవును పెద్దపులి చంపినట్లు గ్రామస్తులు తెలిపారు. అనంతరం సమీపంలోని చాపరాయి కొండ ప్రాంతంలో పెద్దపులి ఉన్నట్లు సమాచారం రావడంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై మాజీ సర్పంచ్‌ బండారు రామలక్ష్మి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి, ప్రజల భయాందోళనలను దృష్టిలో ఉంచుకుని పెద్దపులి సంచారంపై తగిన చర్యలు చేపట్టాలని కోరారు. సమాచారం అందుకున్న ఫోక్స్‌పేట అటవీ రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పెద్దపులి సంచారానికి సంబంధించిన ఆనవాళ్లను పరిశీలిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్