శ్రీహరికోట : హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ శనివారం శ్రీహరికోట నుంచి విక్రమ్ 1 రాకెట్‌ను నింగిలోకి పంపిన సంగతి విదితమే. ఆ ప్రయోగం పట్ల ప్రధానమంత్రి మోడి హర్షం వ్యక్తం చేశారు. 'ఈ ఘనత అనేక మంది భారతీయ యువతలో ప్రేరణ నింపుతుంది` అని ప్రధాని మోడి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కక్ష్యలోకి ఉపగ్రహాలు, పేలోడ్స్ చేరుకున్న తర్వాత .. ప్రధాని మోడి ఆ కంపెనీ ఓనర్లకు ఫోన్ చేసి మాట్లాడారు. భారత స్వయం సమృద్ధిని ఈ ప్రయోగం చాటుతుందని అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ ఈసిఒ పవన్ కుమార్ చందన, సహ వ్యవస్థాపకుడు నాగ భరత్ డాకాతో ప్రధాని ఫోన్‌లో మాట్లాడారు. విక్రమ్ 1 ప్రయోగం సక్సెస్ అయిన నేపథ్యంలో ఆ ఇద్దరికీ, వాళ్ల కంపెనీకి ఆయన అభినందనలు తెలిపారు. రాకెట్ లాంచింగ్ సమయంలో ఆ ఇద్దరూ ఇస్రోని మిషన్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నారు. మిషన్ ఆగమనం మరింత ముందుకు వెళుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మిషన్‌తో మనం ఆత్మనిర్భర్ అని నిరూపించుకున్నామన్నారు. రాకెట్ పూర్తి ఇండియాలోనే డిజైన్ చేసి, తయారు చేసినట్లు చందన తెలిపారు. ప్రయోగం సందర్భంగా బెస్ట్ విషెస్ చెబుతూ వందేమాతరం లేఖను మోడి రాసిన విషయం తెలిసిందే. అయితే ఆ లేఖ విజయవంతంగా కక్ష్యలోకి చేరినట్లు స్కైరూట్ సిఇఒ తెలిపారు. భారతీయ అంతరిక్ష ప్రయాణంలో ఇది అత్యంత ముఖ్యమైన సందర్భమన్నారు. ప్రైవేటు రంగంలో కొత్త భాగస్వామ్యుల పాత్ర పెరుగుతోందని, దీంతో ఆవిష్కరణలు ఊపందుకున్నట్లు మోడి తెలిపారు. ఈ ఘనత అనేక మంది భారతీయ యువతలో ప్రేరణ నింపుతుందని, దీంతో ఆ యువత తమ కలలను సాకారం చేసుకునే సందర్భం వస్తుందన్నారు. నిర్భయంగా యువత తమ ఆవిష్కరణలకు రూపం ఇవ్వనున్నట్లు ప్రధాని తన ఎక్స్ అకౌంట్‌లో పేర్కొన్నారు.
ఈ ఘనత భారత యువతలో ప్రేరణ నింపుతుంది : ప్రధాని మోడి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 18, 2026, 02:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)