అమరావతి : యూట్యూబర్ రావణ్ రిమాండ్ గడువును కోర్టు మరోసారి పొడిగింది. ఏలూరులో జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పిఠాపురం జనసేన నాయకుడు, పిఠాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ సభ్యుడు బొజ్జా కుమార్ బాబు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో రావణ్ పై పలు సెక్షన్ల్ కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. అయితే ఈ గడువు ముగియడంతో రావణ్‌ను పోలీసులు గన్నవరం కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో రావణ్ రిమాండ్ గడువును పొడిగిస్తూ ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఆయనను పోలీసులు మళ్లీ జైలుకు తరలించారు. మరోవైపు ఇదే కేసులో మరో యూట్యూబర్ గమన, ఇంద్రసేనా చౌదరిని గన్నవరం డీఎస్పీ కార్యాలయంలో విచారించారు. మూడు రోజుల కస్టడీలో భాగంగా ఈ రోజు వారిని ప్రశ్నించారు. గత రెండు రోజులుగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. గమనతో పాటు ఇంద్రసేనా చౌదరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యూట్యూబ్ ఛానెళ్ల నిర్వహణ, ప్రోద్భలం, ఆర్థిక లావాదేవీలు, విద్వేషపూరిత వీడియోలపైనా ఆరా తీశారు.
యూట్యూబర్ రావణ్ రిమాండ్ గడువు మరోసారి పొడిగింపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 18, 2026, 04:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)