అమరావతి : ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1 ప్రయోగం విజయవంతమైంది. దీనిపై ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. శ్రీహరికోట నుంచి జరిగిన ఈ చరిత్రాత్మక ప్రయోగం దేశ అంతరిక్ష రంగంలో ఒక మైలురాయి అని పేర్కొన్నారు. ఈ రోజు భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించిందన్నారు. తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగం మన దేశానికే గర్వకారణం అని చెప్పారు. సాంకేతికతకు, సృజనాత్మకతకు మోడి ప్రాధాన్యమిస్తారని ఈ ప్రతిష్ఠాత్మక మిషన్‌తో మరోసారి నిరూపితమైందని ప్రశంసించారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధింవచ్చని ఈ ప్రయోగంతో భారతీయులందరికీ ఒక శక్తిమంతమైన సందేశాన్ని పంపారు అని అభినందించారు. ఈ విజయం రాబోయే తరాలు పెద్ద కలలు కనడానికి, భారతదేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నానంటూ పవన్ తన పోస్టులో పేర్కొన్నారు.
‘విక్రమ్-1 విజయవంతంపై డిప్యూటి సిఎం పవన్ హర్షం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 18, 2026, 03:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)