శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సోనమ్ వాంగ్, అభిజీత్‌లపై పోలీసుల చర్యకు సిపిఎం ఖండన

1 గంట క్రితం

CPM condemns police action against Sonam Wang and Abhijit.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 02:53 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీపక్‌లపై ఢిల్లీ పోలీసులు తీసుకున్న చర్యను సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ ఖండించారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో నిందితులపై చర్యలు తీసుకోవడం కంటే శాంతియుత నిరసనలను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఆసక్తి చూపుతోందంటూ ... ఎంఎ బేబి శనివారం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. సోనమ్ వాంగ్ చుక్, అభిజీత్ దీపక్ లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రశ్నాపత్రం లీక్, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడం వంటి కుంభకోణంలో ఉన్న కేంద్ర విద్యాశాఖ మంత్రిపై చర్యలు తీసుకోవడానికి బదులుగా .... శాంతియుత నిరసనకారులను ప్రభుత్వం అణచివేయాలని చూడటం దుర్మార్గమన్నారు. మోడి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ఇది సంకేతం అని ధ్వజమెత్తారు. జవాబుదారీతనానికి బదులుగా అసమ్మతిని అణచివేయడం ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదు అని స్పష్టం చేశారు. సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శనివారంతో 21వ రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో .... వైద్య సలహా, ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ పోలీసులు ఈరోజు తెల్లవారుజామున ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ పోలీసుల చర్య అనంతరం .... జంతర్ మంతర్ వద్ద నిరసనకారులపై జరిగిన అణచివేత చర్యలో ఢిల్లీ పోలీసులు తనను కొట్టి, నిర్బంధించారని శ్రీ దీప్కే ఆరోపించారు. నేటి నుంచి తాను నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్లు శ్రీ దీప్కే ప్రకటించారు. అయితే ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .... అవసరమైన వైద్య సంరక్షణ కోసం వాంగ్ చుక్ ను ఆసుపత్రికి తరలించామన్నారు. నిరసనకారులు జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసన స్థలాన్ని శాంతియుతంగా విడిచిపెట్టాలని కోరామన్నారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, వివాదంపై విద్యార్థుల మరణాలకు వ్యతిరేకంగా సిజెపి నేతృత్వంలోని ఆందోళనకు మద్దతుగా సోనమ్ వాంగ్ చుక్ జూన్ 28 నుండి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి విదితమే.

సంబంధిత వార్తలు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్