శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మహిళపై దాడి ఘటన - సిఐ సత్యనారాయణపై చర్యలు

2 గంటల క్రితం

Incident of assault on a woman – Action taken against CI Satyanarayana.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 03:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గుంటూరు : గుంటూరులో మహిళపై దాడి ఘటనకు సంబంధించి సిఐ సత్యనారాయణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సత్యనారాయణను విఆర్‌కు పంపుతూ గుంటూరు రేంజ్‌ ఐజి ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు తీసుకోవడంలో సిఐ విఫలమయ్యారని ఐజి నిర్థారించారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. సమాజంలో ఇలాంటి ఘటనలకు తావులేదని కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు సమగ్ర విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు.. కేసు నమోదు నుంచి, చర్యలు తీసుకోవడం వరకు సిఐ నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు నిర్థారించి చర్యలు తీసుకున్నారు. ఈ నెల 15వ తేదీన రాత్రి సమయంలో కృష్ణబాబుకాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటార్‌ ద్వారా నీరు పడుతుండగా, స్థానిక 21వ డివిజన్‌ టిడిపి కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి, అతని కుటుంబ సభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగి, తీవ్రంగా కొట్టారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిపోతుండగా మూర్తి సోదరి, ట్రాన్స్‌జెండర్‌ మాధవి ఆమెపై దాడి చేసి కొట్టింది. ఆమె వెంటపడి దుస్తులు చించేసి పూర్తిగా వివస్త్రను చేశారు. వదిలిపెట్టాలని బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించలేదు. నడిరోడ్డుపై మళ్లీ దౌర్జన్యానికి దిగగా, స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. బాధితురాలు ఈ నెల 16 న పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్