శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమహిళలపై దాడులు చేసిన వారిని శిక్షించాలి

2 గంటల క్రితం

aidwa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 10:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఐద్వా డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ​స్థానిక ఎన్నికల సందర్భంగా మహిళలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర కమిటీ డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి సావిత్రి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ​స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో మహిళలపై తీవ్రమైన దాడులు, దౌర్జన్యాలు జరగడం సభ్య సమాజానికి సిగ్గుచేటని పేర్కొన్నారు. మాజీ మంత్రి విడదల రజినితోపాటు రాష్ట్రంలో అనేక మందిపై అత్యంత పాశవికంగా దాడులు చేయడం, వస్ర్తాలు తొలగించే ప్రయత్నాలు చేయడం వంటి ఘటనలు యథేచ్ఛగా జరిగాయన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఒకవైపు మాటల్లో చెబుతూ మరోవైపు ఇలాంటి దాడులు చేయడానికి కారణమైన టిడిపి నేతలను మహిళలు నిలదీయాలని కోరారు. మహిళల పట్ల కూటమి పార్టీల నేతలకు ఏమాత్రం బాధ్యత ఉన్నా.. తక్షణం ఇలాంటి ఘటనలపై విచారణ జరిపించాలని, అందుకు బాధ్యులైన వారిని పార్టీల నుండి బహిష్కరించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు‌. మహిళలపై పెద్దయెత్తున దాడులు జరుగుతున్నా.. ఉప ముఖ్యమంత్రి పవన్‌‌కల్యాణ్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. భారతమాత అంటూ నిత్యం జపం చేసే బిజెపి నాయకులకు కళ్ళముందే తల్లుల పట్ల జరుగుతున్న అమానుషాన్ని ఖండించకపోవడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని విమర్శించారు. మాజీ మంత్రి విడదల రజినిపై ఆమె ఇంటిలోనే దాడి చేసిన పోలీసులను, అందుకు కారణమైన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్