ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

చెకుముకి సైన్స్‌ సంబరాలను జయప్రదం చేయండి

02 ఆగస్టు, 2026

jvv
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 09:12 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- 27న పాఠశాల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు

- జెవివి రాష్ఠ్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశోధనా ఆసక్తి, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో ఈనెల 27న నిర్వహించనున్న పాఠశాల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేయాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. విజయవాడలోని బాలోత్సవ భవన్ లో ఆదివారం జెవివి రాష్ట్ర కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రీయ సమాజం ఏర్పాటు లక్ష్యంగా గత నాలుగు దశాబ్దాలుగా జెవివి తెలుగు ప్రజలతో మమేకమై పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగానే భావితరాలలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకు, శాస్త్రీయ దృక్పథాన్ని ఏర్పరిచేందుకు పాఠశాలలు కేంద్రంగా పనిచేస్తున్నామన్నారు. గత 36 సంవత్సరాలుగా నిర్వహిస్తోన్న చెకుముకి సైన్స్ సంబరాలు విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు, సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందింపజేసేందుకు ఉపయోగపడతాయన్నారు. జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్ మాట్లాడుతూ ఈ చెకుముకి సైన్స్ సంబరాలు నాలుగు స్థాయిల్లో పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో జరుగుతాయని తెలిపారు. పాఠశాల స్థాయి ఈనెల 27న, మండల స్థాయి సెప్టెంబర్ 11న, జిల్లాస్థాయి సెప్టెంబర్ 27న నిర్వహించాలన్నారు. నవంబర్ 1నుంచి 3వరకు రాష్ట్రస్థాయి సంబరాలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 8,9,10 తరగతుల విద్యార్థులు పాల్గొనవవచ్చునన్నారు. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు, విద్యాధికారులు విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా చెకుముకి సంబరాల గోడపత్రికలను రాష్ట్ర కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు జి మురళీధర్, కె త్రిమూర్తులరెడ్డి, కె శ్రీనివాస్, రాజగోపాల్, జి నిర్మల, వైఎస్ నాగేశ్వరరావు, సిహెచ్ జయప్రకాష్, బి మాణిక్యం శెట్టి, ఎస్ రెడ్డప్ప, గొంటి గిరిధర్, యార్క్ ప్రసాద్, ఆదిశేషు,శివరాం, బి రవి, డి బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్