శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపొగాకు రైతులను ఆదుకోవాలి..

1 గంట క్రితం

pogaku
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 10:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య

ప్రజాశక్తి-చీమకుర్తి (ప్రకాశం జిల్లా) : వర్జీనియా పొగాకు కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.వెయ్యి కోట్లు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సంతనూతలపాడు, చీమకుర్తి మండలాల్లో పొగాకు రైతులతో శుక్రవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చీమకుర్తి మండలంలోని కెవి పాలెంలో జరిగిన సభతో రైతు సంఘం నాయకులు బెజవాడ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సభలో కృష్ణయ్య మాట్లాడుతూ ఈ నెల 29న జరిగే జాతీయ రహదారి దిగ్బంధనాన్ని జయప్రదం చేయాలని, ప్రతి ఇంటి నుంచి రైతులు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా కార్యదర్శి చుండూరి రంగారావు, రైతు సంఘం జిల్లా నాయకులు పమిడి వెంకట్రావు, జయంతి బాబు మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవహరించే తీరు పొగాకు రైతులకు ఏమాత్రమూ ఉపయోగకరంగా లేదని, ప్రభుత్వ వ్యవహార శైలి మార్చుకోవాలని పేర్కొన్నారు. ‌కార్యక్రమంలో నాయకులు, పొగాకు రైతులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్