బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు ‘పేదలకు పట్టాభిషేకం’

1 గంట క్రితం

నేడు ‘పేదలకు పట్టాభిషేకం’
24,042 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ
హాజరుకానున్న సిఎం చంద్రబాబు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 07:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 24,042 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ

- హాజరుకానున్న సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి - ఎన్‌‌టిఆర్‌ ‌ప్రతినిధి : విజయవాడ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో బుధవారం ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రకమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొననున్నారు. అజిత్ సింగ్ నగర్లోని ఎంబి స్టేడియంలో ఆయన 24,042 మందికి ఇళ్ల పట్టాలను అందజేయనున్నారు. విజయవాడ నగర పరిధిలోని కొండ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు జీఓ ఎంఎస్ నంబర్ 306 కింద ఒరిజినల్ అసైనీలు, వారి చట్టబద్ధమైన వారసులకు సంబంధించి 12,710 కేసులను పరిష్కరించి 11,36,292 చదరపు గజాల భూమిని నేరుగా రిజిస్ట్రేషన్ చేయనున్నారు. అలాగే జీఓ ఎంఎస్ నంబర్ 30 కింద ఆక్రమణదారులు, పాట్ కేసులకు సంబంధించి 11,332 కేసులను ఉచితంగా క్రమబద్ధీకరించారు. ఇందులో 150 చదరపు గజాలలోపు ఉన్న నిరుపేదల కేసులు 10,878 కాగా, 150 చదరపు గజాలపైన ఉన్నవి 454 కేసులు ఉన్నాయి. మండలాల వారీగా చూస్తే అత్యధికంగా విజయవాడ వెస్ట్‌లో 6,790 మంది, విజయవాడ ఈస్ట్‌లో 6,619 మంది, విజయవాడ నార్త్‌లో 4,825 మంది లబ్ధిపొందనున్నారు. గ్రామీణ ప్రాంతాలైన జగ్గయ్యపేటలో 1,050 మంది, ఇబ్రహీంపట్నంలో 484 మంది, విజయవాడ రూరల్‌లో మొత్తం 866 మంది, విజయవాడ సెంట్రల్‌లో మొత్తం 3,021 మందికి ఈ పథకం ద్వారా మేలు జరగనుంది. సిఎం పర్యటన నేపథ్యంలో స్టేడియం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్టేడియాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ముగ్గురు ఎస్‌‌పిలు, ఒక ఎడిసిపి, 17 మంది ఎసిపిలు, 37 మంది ఇన్స్పెక్టర్లతో కలిపి 1076 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్