హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీ (NPA)లో తోటి మహిళా ట్రైనీ ఐపిఎస్ అధికారిపై లైంగిక వేధింపులు, దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనను ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కర్నాటకకు చెందిన 30 ఏళ్ల వివాహిత ట్రైనీ ఐపిఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు .... ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెకు అసభ్యకర సందేశాలు పంపుతూ వేధించడంతో పాటు గదిలోకి లాక్కెళ్లి జుట్టు పట్టుకుని గొంతు నులిమి, మెడపై కత్తిపెట్టి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. అలాగే బాధితురాలి వ్యక్తిగత వీడియోను రికార్డు చేసి ఆమె భర్తకు పంపుతూ బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు తీవ్రమైన సెక్షన్లతో పాటు ఐటి యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, NPA ప్రివిలేజ్ కమిటీ సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించి ఆరోపణలు నిజమని నిర్ధారించడంతో ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. పోలీసులు నోటీసులు జారీ చేయగా, తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ ఉదయ్ కృష్ణారెడ్డి వాట్సాప్ స్టేటస్‌లో పేర్కొన్నట్లు సమాచారం. మోతీనగర్‌లోని బంధువు ఇంటికి వచ్చిన ఉదయ్.. సోమవారం ఉదయం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన అతడి బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
18 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 20, 2026, 11:40 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)