శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లారీని ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు.. డ్రైవర్‌ మృతి

1 గంట క్రితం

bus.png
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 11:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 19 మంది ప్రయాణికులకు గాయాలు.. నెల్లూరు ఆసుపత్రికి తరలింపు

ప్రజాశక్తి-మనుబోలు: నెల్లూరు జిల్లా మనుబోలు మండలం గురివిందపూడి క్రాస్‌రోడ్‌ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి విజయవాడ వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా, మరో 18 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్