ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాక్‌ గూఢచర్యం కేసులో ఇద్దరు అరెస్టు

06 అక్టోబర్, 2026

sa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 09:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 18 మంది అనుమానితులపై దర్యాప్తు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెంట్లతో సంబంధాలు కలిగి రక్షణ రహస్యాలను చేరవేశారన్న ఆరోపణలపై ఎపి కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ ఇద్దరిని అరెస్టు చేసింది. ఈ కేసులో మొత్తం 18 మంది అనుమానితులు ఉండగా, వారిలో 13 మంది నావికాదళ సిబ్బంది ఉన్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఆపరేషన్‌ ఫైర్‌వాల్‌-2026’లో భాగంగా ఎపి, కేరళం, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌, గోవా, ఢిల్లీ, తమిళనాడు, చత్తీస్‌గఢ్‌, బీహార్‌లో 12 కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ బృందాలను మోహరించామని పేర్కొంది. ఆయా రాష్ట్రాల ఎటిఎస్‌, నావికాదళ అధికారులు, స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని అనుమానితుల నుంచి ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపింది. విశాఖలో సివిలియన్‌ కాంట్రాక్టు డ్రైవర్‌ అన్నం సాయి వరప్రసాద్‌, నావికాదళ ఉద్యోగి ప్రదీప్‌ ముఖర్జీలను అరెస్టు చేశామని పేర్కొంది. రక్షణ రంగానికి చెందిన సున్నిత సమాచారాన్ని పాక్‌ ఏజెంట్లకు చేరవేసినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయని తెలిపింది. విజయవాడ జిల్లా కోర్టు ఈ నెల 14 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. మిగిలిన 16 మంది అనుమానితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్