ప్రజాశక్తి-కడప : కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కలకలం రేపుతోంది. తాజాగా కడప జిల్లాలో కోవిడ్ తరహా లక్షణాలతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కడప,రాజంపేట ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రమైన కరోనా లక్షణాలతో బాధపడుతూ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కడప, రాజంపేటల్లోని బాధిత ప్రాంతాలలో మృతుల కుటుంబ సభ్యులతో పాటు, ప్రైమరీ కాంటాక్స్ వివరాలను సేకరిస్తున్నారు. స్థానికంగా ఎవరికైనా జ్వరం, దగ్గు, శ్వాసకోస సమస్యలు ఉన్నాయా అనే అంశంపై ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. అయితే, జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి, ఈ మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం. అధికారికంగా నిర్ధారించే వరకు ప్రజలు భయాందోళనలకు గురికాకుండా, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ ఇద్దరి మృతి..!
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 11, 2026, 11:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)