శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కారు చెట్టును ఢీకొని ఇద్దరు మృతి

1 గంట క్రితం

road
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 01:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు

ప్రజాశక్తి-అమలాపురం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహిళలిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన ముదునూరి రామభద్ర రాజు (60), ఆయన తమ్ముడు వెంకటసుబ్బరాజు (58) వారి భార్యలు విజయలక్ష్మి, శారదతో కలసి భీమవరంలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి లక్కవరానికి కారులో బయలుదేరారు. లక్కవరం ఒఎన్‌‌జిసి సైట్ దగ్గరకు వచ్చేసరికి రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి చెట్టును కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. డ్రైవింగ్ చేస్తున్న రామభద్ర రాజు, పక్కన ఉన్న వెంకటసుబ్బరాజు అక్కడికక్కడే మృతి చెందారు. తోటికోడళ్లు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్