శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డేటా సెంటర్లతో పెద్దగా ఒరిగేదేమీ లేదు..!

1 గంట క్రితం

moodys
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 01:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 2030 నాటికి జిడిపికి 0.13 శాతమే తోడ్పాటు

- మూడీస్ అంచనా

న్యూఢిల్లీ : భారత్‌‌లో డేటా సెంటర్ల రంగంలోకి బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఒరిగేదేమీ లేదు. వీటి వల్ల 2030 నాటికి దేశ స్థూల దేశీయోత్పత్తికి (జిడిపి) లభించే వాటా కేవలం 0.13 శాతంగానే ఉండొచ్చని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ తన తాజా నివేదికలో వెల్లడించింది. నిర్మాణ దశలో పెట్టుబడుల ద్వారా 0.10 శాతం, విద్యుత్ ఉత్పత్తి పెట్టుబడుల ద్వారా మరో 0.03 శాతం మేర జిడిపికి దోహదపడతాయని పేర్కొంది. ఈ కేంద్రాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చినా ఈ వాటా ఇంతే ఉంటుందని పేర్కొంది. ఈ పెట్టుబడులు సంఖ్యాపరంగా పెద్దవే అయినప్పటికీ.. భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణంతో పోలిస్తే చాలా చిన్నవని తెలిపింది. దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలు మాత్రం దేశీయంగా విడిభాగాల తయారీ, క్లౌడ్ సేవల విస్తృతిపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది. డేటా సెంటర్లు అత్యధికంగా మూలధనంతో కూడుకున్నవి కావడంతో ఉపాధి కల్పన కూడా నిర్మాణ దశలో 0.01 శాతం, పూర్తిస్థాయిలో 0.02 శాతంగా అత్యంత పరిమితంగానే ఉంటుందని తెలిపింది. 2030 నాటికి మొత్తం విద్యుత్ డిమాండ్‌లో వీటి వాటా 5 శాతం లోపే ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. అయితే సర్వర్లు, కూలింగ్ సిస్టమ్స్ వంటి పరికరాల దిగుమతి తీవ్రంగా ఉండటం వల్ల దేశీయంగా విలువ జోడింపు పరిమితం కానుందని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్