పోలవరం : ఎగువన కురుస్తోన్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు వద్ద నీటిమట్టం క్రమంగా పెరగడంతో.. దిగువ కాపర్ డ్యామ్ సమీపంలో నదిలో జేసీబీ మునిగిపోయింది. దీంతో ఆ జేసీబీని బయటకు తీసుకువచ్చేందుకు తాడు వేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఇద్దరు నదిలో పడి గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో ఒకరి మృతదేహం లభ్యమవ్వగా, అతడిని డ్యామ్ ఇంజినీర్ గా గుర్తించారు. మిషన్ ఆపరేటర్ ఆచూకీ కోసం మత్స్యకారులు, రెస్క్యూ టీమ్ గాలిస్తున్నారు. కాగా.. ఇంజినీర్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం పోలవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర తీరంలోని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని క్రమంలో వేటకు వెళ్లొద్దన్నారు. రేపటి వరకూ మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకుండా మత్స్యకారులు సహకరించాలని మంత్రి అచ్చెన్న అన్నారు.
పోలవరం ప్రాజెక్టులో ఇద్దరు గల్లంతు
58 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 27, 2026, 05:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)