న్యూఢిల్లీ : అయోధ్య విరాళాల స్కామ్ కేసులో ప్రత్యేక విచారణ బృందం (సిట్)ని నియమించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఐజిపి కిరణ్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఐదవ సభ్యునిగా ఒక ఫోరెన్సిక్ ఆడిటర్‌ను చేర్చాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహన్‌లతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జులై 25న సిట్‌ను ఏర్పాటు చేశామని, మరో రెండు వారాల్లో నివేదికను సమర్పించనుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ఈ సిట్‌లో ఐజిపితో పాటు డిఐజి స్థాయి అధికారి, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి), అదనపు ఎస్‌పి సభ్యులుగా ఉన్నారని అన్నారు. ఈ బృందంలో ఫోరెన్సిక్ అధికారిని కూడా చేర్చాలని పేర్కొంటూ, రెండు వారాల తర్వాత విచారణ చేపడతామని కోర్టు ఆదేశించింది.
అయోధ్య విరాళాల స్కామ్: సిట్‌ను నియమించామన్న యుపి ప్రభుత్వం
56 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 27, 2026, 05:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)