పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలు
ప్రజాశక్తి ఏలేశ్వరం (కాకినాడ) : ఎల్ నినో ప్రభావంతో ఏలేరు పరివాహక ప్రాంతాలలో వర్షపాతం తగ్గడంతో రిజర్వాయర్లో జలాలు అడుగంటుతున్నాయి. ఏలేరు రిజర్వాయర్ సామర్థ్యం 24. 11 టీ ఎం సీలు (86.54 మీటర్లు). కాగా ప్రస్తుతం రిజర్వాయర్లు కేవలం 8.24 టి.ఎం.సి లు (74.00 మీటర్లు)నీటి నిల్వలు ఉన్నాయి. రిజర్వాయర్ ఆయకట్టు క్రింద సాగులో ఉన్న జగ్గంపేట, కిర్లంపూడి, గొల్లప్రోలు, పిఠాపురం, యు కొత్తపల్లి మండలాలలో గల 53 వేల ఎకరాల రైతుల అవసరాల దృష్టిలో ఉంచుకొని ఆకుమడులకు డి సి ఆర్ స్లూయిజ్ ద్వారా 600 క్యూసెక్కులు, స్పిల్ వే ద్వారా 700 క్యూసెక్కులు మొత్తం 1100 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ లో 6.16 టి ఎం సి ల నీరు నిల్వలో ఉంటే బయటికి విడుదల చేసే అవకాశం ఉండదు.
పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలు ఏలేరు రిజర్వాయర్ కు : ఏలూరు రిజర్వాయర్ కు గోదావరి జిల్లాలు అందించేందుకు గత 2017 సంవత్సరంలో చంద్రబాబు సర్కార్ 1500 కోట్ల రూపాయలతో పురుషోత్తపట్నం వద్ద ఎత్తిపోతల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఎనిమిది మోటార్లను ఏర్పాటు చేసి 1400 క్యూసెక్కుల గోదావరి నీటిని ఏలేరు రిజర్వాయర్ కు పైప్ లైన్ ద్వారా తోడే విధంగా నిర్మించారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని వినియోగించలేదు. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు రైతులకు సాగునీరు, విశాఖ స్టీల్ ప్లాంట్ అవసరాలకు నీటిని అందించే ఉద్దేశంతో ప్రస్తుతం అధికారులు 1225 క్యూసెక్కుల నీటిని తరలించేందుకు సోమవారం స్వీకారం చుట్టినట్లు రిజర్వాయర్ ఈ ఈ శ్యాం కుమార్ తెలిపారు.







కామెంట్‌లు (0)