బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

శ్రీ ప్రకాష్ అండర్-19 బాలికల ఖో-ఖో జట్టు జాతీయ స్థాయికి అర్హత

27 జులై, 2026

Sri Prakash Under-19 Girls' Kho-Kho Team Qualifies for National Level
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 04:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కోటనందూరు (కాకినాడ) : శ్రీ ప్రకాష్ సీబీఎస్‌ఈ అండర్-19 బాలికల ఖో-ఖో జట్టు అనూహ్య ప్రతిభ కనబరిచి, జూలై 23నుండి 26 వరకు కరీంనగర్, తెలంగాణా లో నిర్వహించిన  సీబీఎస్‌ఈ  క్లస్టర్ ఖో -ఖో పోటీలలో ప్రథమ స్థానం సాధించి ఛాంపియన్‌గా అవతరించి,  బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. పోటీలో జట్టు సభ్యులు అత్యుత్తమ సమన్వయం, క్రమశిక్షణ, పోరాట పటిమను ప్రదర్శిస్తూ ప్రత్యర్థి జట్లపై విజయాలు సాధించడం ద్వారా విద్యా సంస్థకు విశేష కీర్తిని తీసుకువచ్చారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్‌లు  చిరంజీవి, హేమ లను ప్రత్యేకంగా అభినందిస్తూ, వారి శిక్షణ, మార్గదర్శకత్వం, అంకితభావం విద్యార్థుల విజయానికి బలమైన పునాది అని కొనియాడారు. విద్య, క్రీడలతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి శ్రీ ప్రకాష్ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తోందని, ఈ విజయం ఆ దిశగా మరో మైలురాయిగా నిలిచిందని యాజమాన్యం పేర్కొంది. ఈ సందర్భంగా విద్యాసంస్థల అధినేత సిహెచ్. వి. కె. నరసింహారావు, జాయింట్ సెక్రటరీ సిహెచ్. విజయ్ ప్రకాష్ ,  ప్రిన్సిపాల్  ఎం. వి. వి. ఎస్. మూర్తి,  రవి కుమ్మమూరు  జట్టు సభ్యులను అభినందించారు. సెప్టెంబర్ 19 నుండి 23 వరకు చెన్నై, తమిళనాడు నందు జరిగే జాతీయ స్థాయి పోటీలలో కూడా ఇదే విజయోత్సాహంతో అత్యుత్తమ ప్రతిభ కనబరచి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్