మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిహారయాత్రలో విషాదం.. సోకులేరు వాగులో ఇద్దరు గల్లంతు

57 నిమిషాల క్రితం

death
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 11:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - మోతుగూడెం (పోలవరం జిల్లా): పోలవరం జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో సోకలేరు వాగు వద్ద మంగళవారం విషాదం చోటుచేసుకుంది. స్నానం కోసం వాగులోకి దిగిన ఇద్దరు గల్లంతయ్యారు. పోలీసుల కథనం మేరకు.... పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం, వీరంపాలెం గ్రామానికి చెందిన పెండెం బాబీ, పెండెం కల్యాణ్‌, ఏలేటి శామ్యూల్ సుదర్శన్, పెనుమాల అనిలేష్, అందుగుల పాల్ రాజు కలిసి విహారయాత్ర నిమిత్తం చింతూరు మండలం చదలవాడ పంచాయతీ పరిధి తులసిపాక గ్రామ సమీపంలో ఉన్న సోకులేరు వ్యూ పాయింట్ వద్దకు వచ్చారు. స్నానం చేయడానికి వాగులో దిగగా పెండెం బాబీ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అతనిని రక్షించే ప్రయత్నంలో కల్యాణ్‌ ప్రమాదానికి గురయ్యారు. వాగులో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో ఇద్దరూ కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న చింతూరు సిఐ గోపాలకృష్ణ, మోతుగూడెం ఎస్‌ఐ అబ్దుల్ నాసిర్ హుస్సేన్, ఎఎన్‌ఎస్, ఎన్‌డిఆర్‌ఎస్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్