ఐదుకు చేరిన మృతుల సంఖ్య
బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ రిమ్స్ ఎస్‌ఎన్‌సియులో జరిగిన షార్ట్స్ సర్క్యూట్ ఘటనలో ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు శిశువులు బుధవారం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. రిమ్స్‌లోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్, ఎసి పేలడంతో అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై విచారణకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అవసరమైతే చిన్నారులను హైదరాబాద్‌లోని కార్పొరేట్, ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించాలని మంత్రి అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. మృతిచెందిన ఐదుగురు చిన్నారుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆర్థిక సాయం అందజేశారు. బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రూ.లక్ష చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం స్పందించి మృతిచెందిన చిన్నారుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న వారికి రూ.పది లక్షల పరిహారం చెల్లించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)