శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కేంద్రమంత్రి ధర్మేందర్‌ ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే

2 గంటల క్రితం

dyfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 10:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- డివైఎఫ్‌ఐ డిమాండ్‌

‌ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : లక్షలాది విద్యార్థుల జీవితాలను ప్రశ్నార్థకం చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షకార్యదర్శులు వై రాము, జి. రామన్న శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ధర్మేందర్‌ ‌కోరుతూ సోనమ్ వాంగ్‌చుక్ ఇరవై రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు. ఆయన డిమాండ్లకు సంఘీభావంగా పలువురు విద్యార్థులు కూడా నిరాహార దీక్షలు చేస్తున్నారని పేర్కొన్నారు. నిరసనకారులతో శాంతియుత, ప్రజాస్వామ్యయుత చర్చలు జరపడానికి బదులుగా, కేంద్ర ప్రభుత్వం పోలీసు చర్యల ద్వారా అసమ్మతిని అణచివేయాలని చూస్తోందని తెలిపారు. నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్‌‌పై పోలీసులు బల ప్రయోగం చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. వాంగ్‌చుక్‌ను తక్షణమే విడుదల చేసి, అణచివేతకు బదులుగా నిరసనకారులతో అర్థవంతమైన చర్చలు జరపాలని డిమాండ్‌ ‌చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్