ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాసనమండలి సభ్యులుగా వర్ల రామయ్య ప్రమాణం చేశారు. మండలి ఛైర్మన్ కె మోషేన్ రాజు ఆయనతో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఆయన శాసనమండలిలో ప్రమాణం చేశారు. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక అనంతరం తిరిగి సభ ప్రారంభం కాగానే ఈ ప్రక్రియను ఛైర్మన్ నిర్వహించారు. అయితే ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మినహా వైసిపి సభ్యులెవరూ సభలోకి రాలేదు. ఈ నేపథ్యంలో కనీస హాజరుశాతం (కోరం) లేదని, కోరం చూసి సభను నడపాలని బొత్స అన్నారు. ఛైర్మన్ హాజరైన సభ్యులను లెక్కపెట్టి 10 మంది ఉన్నారని, కోరం ఉందంటూ వర్లతో ప్రమాణం చేయించారు.
వర్ల, రమాదేవిని నామినేట్ చేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు
వర్ల రామయ్య, వడ్డే దళవాయి రమాదేవిని గవర్నర్ కోటాలో ఎంపిక చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు విడుదల చేసింది. మయానా జకియా ఖాన్, పండుల రవీంద్ర పదవీ కాలం జులై 27తో ముగిసింది. వారి స్థానంలో రామయ్య, రమాదేవిని నామినేట్ అయ్యారు.








కామెంట్‌లు (0)