ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వెలిగొండ ప్రాజెక్టు ట్రయల్ విజయవంతం

1 గంట క్రితం

veligonda.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 07:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మార్కపురం : పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాజెక్టు మొదటి దశకు సంబంధించి అధికారులు ఆదివారం నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆదివారం ఉదయం అధికారులు కొల్లం వాగు వద్ద ప్రాజెక్టు గేట్లను ఎత్తి సొరంగ మార్గంలోకి కృష్ణా జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గేట్ల పనితీరు, సొరంగంలో నీటి ప్రవాహ వేగాన్ని, నీటి తరలింపు ప్రక్రియను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. సొరంగంలో పరుగులు తీసిన కృష్ణా జలాలు గంటవానిపల్లి క్రాస్ హెడ్ రెగ్యులేటర్‌కు చేరుకున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా రెగ్యులేటర్ వద్ద సైరన్ మోగించి సమీప ప్రజలను అప్రమత్తం చేశారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో అధికారులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్