బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైభవంగా విజయవాడ ఉత్సవ్‌–2.0 మెగా కార్నివాల్‌

4 గంటల క్రితం

cbn.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 07:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సంస్కృతే మన ఉనికికి పునాది: సీఎం చంద్రబాబు

ప్రజాశక్తి–విజయవాడ : విజయవాడ ఉత్సవ్‌–2.0 ముగింపు సందర్భంగా ఏలూరు రోడ్డులో నిర్వహించిన మెగా కార్నివాల్‌ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్నివాల్‌ను ప్రారంభించి, కళాబృందాల కవాతుకు అభివాదం చేశారు. శంఖారావంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పూలతో అలంకరించిన ఉత్సవ రథం, గుర్రాలు, ఒంటెలు, డప్పు, సన్నాయి వాయిద్యాలు, గరడి సాములు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, విజయవాడ ఉత్సవ్‌ ద్వారా పర్యాటక రంగంతో పాటు స్థానిక కళాకారులను ప్రోత్సహించడం సంతోషంగా ఉందన్నారు. సోషల్‌ మీడియాలో సమయం గడపడంతో పాటు ఇటువంటి సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొనడం మానసికోల్లాసాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలే మన ఉనికికి పునాది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్యకరమైన, సంపన్నమైన, ఆనందకరమైన సమాజంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విజయవాడ ఉత్సవ్‌ను విజయవంతం చేసిన నగర ప్రజలను అభినందిస్తూ ‘శభాష్‌ విజయవాడ’ అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బోండా ఉమ, వెనిగండ్ల రాము, ఎమ్మెల్సీ వర్ల రామయ్యతో పాటు నిర్వాహకులు, పెద్ద సంఖ్యతో ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్