ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విమల్ ఇలాచీ యాడ్‌.. బాలీవుడ్‌ నటులకు ఫుడ్‌ సేఫ్టీ చీఫ్‌ నోటీసులు

1 గంట క్రితం

add
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 10:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబై : నిషేధిత పాన్ మసాలాను(విమల్ ఇలాచీ యాడ్‌) పరోక్షంగా ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై బాలీవుడ్ నటులు షారూఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ (ఎఫ్‌డీఏ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ‘విమల్ ఇలైచి’ ప్రకటన ద్వారా రాష్ట్రంలో నిషేధిత ‘విమల్ పాన్ మసాలా’ను ప్రచారం చేస్తున్నట్లు ఎఫ్‌డీఏ ఆరోపించింది. ప్రచారం నుంచి వైదొలగడంతోపాటు సోషల్ మీడియా నుంచి ప్రకటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తొలగించాలని, బ్రాండ్‌తో చేసుకున్న ఒప్పందాల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఆరోపణలు రుజువైతే వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు జరిమానాతో పాటు ఏడాది నుంచి మూడేళ్ల వరకు బ్రాండ్ ప్రచారాలపై నిషేధం విధించే అవకాశం ఉంది. ఇదే ప్రకటనలో గతంలో నటించిన అక్షయ్ కుమార్.. 2022లో విమర్శల నేపథ్యంలో క్షమాపణలు చెప్పి ప్రచారం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్