దివంగత నటుడు శ్రీహరి 62వ జయంతిని శనివారం బాచుపల్లిలోని మండపం వద్ద కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీహరి భార్య శాంతి శ్రీహరి, కుమారులు మేఘాంశ్, శశాంక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ.. తన తండ్రి జయంతి సందర్భంగా తాను నటించిన ఆస్మాన్ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సినిమా కోసం ఎంతో కష్టపడ్డామని, తన తండ్రిని అభిమానులు ఆశీర్వదించినట్లే తనను కూడా ఆశీర్వదించాలని కోరారు. శాంతి శ్రీహరి మాట్లాడుతూ.. శ్రీహరి భౌతికంగా తమ మధ్య లేకపోయినా ఎప్పటికీ అందరి హృదయాల్లో నిలిచే ఉంటారని అన్నారు. అనంతరం అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
నాన్నగారిలాగే నన్నూ ఆశీర్వదించండి: మేఘాంశ్ శ్రీహరి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 16, 2026, 10:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)