సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నీరు నీరు.. నీరు...

2 గంటల క్రితం

water
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 05:23 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- నీటి కోసం రోడ్డెక్కిన రైతులు

- రైతులు చేపట్టిన బంద్ సంపూర్ణం

.. పర్చూరు ప్రాంతానికి సాగునీరు తాగునీరు ఇవ్వాలి రైతుల డిమాండ్.

.. భూసేకరణకు వెంటనే గజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్.

.. గంటల తరబడి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన రైతులు

ప్రజాశక్తి-పర్చూరు: నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ నియోజకవర్గ కేంద్రమైన పర్చూరులో తాగునీరు సాగునీరు కొరకు రైతులు సోమవారం చేపట్టిన బంద్ సంపూర్ణంగా జరిగింది. బంద్ శాంతియుత వాతావరణంలో నిరసన తెలుపుతూ నిర్వహించారు. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు, ఆర్టిసి వాహనాలు గ్రామములోకి రాకుండా హైవేపై వెళ్ళిపోవడంతో ప్రయాణికులు నడుచుకుంటూ బస్ స్టేషన్కు చేరడానికి ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సులు సకాలంలో లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను, ఆటోలను ప్రయాణికులు ఆశ్రయించారు. రైతులు ప్రకార్లను ప్రదర్శిస్తూ ఎస్బిఐ యూనియన్ బ్యాంకు కెనరా బ్యాంకులను పోయించారు ఇంకొల్లు రోడ్లో,చీరాల రోడ్లులో చిలకలూరిపేట రోడ్ లో గజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని, భూసేకరణ పూర్తి చేయాలని, నీరే జీవనాధారం అని, నీరు లేకపోతే రైతుల మనుగడ ప్రశ్నార్థకమని ప్లకార్డులతో నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చిలకలూరిపేట రోడ్ లో బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు, రోడ్డుపై బైఠాయించారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు కొల్లా రాజమోహన్ రావు మాట్లాడుతూ పర్చూరు ప్రాంత ప్రజలు రైతులు సాగునీరు తాగునీరు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కనీసం తాగటానికి కూడా మంచినీళ్లు అని తెలిపారు. ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మాణం అని రైతుల కోసం నీరు అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని చెప్పారు. పర్చూరు నుంచి తక్కువ దూరంలో ఉన్న కృష్ణానది జలాలను పర్చూరు వరకు తీసుకురావడంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని చెప్పారు. గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించాలని గత పది రోజులు నుండి పర్చూరులో రిలే నిరాహార దీక్షలు చేపట్టామని ప్రభుత్వం స్పందించకపోవడంతో బందుకు పిలుపునిచ్చామని చెప్పారు. తాగునీరు ప్రజల ప్రాథమిక హక్కుని ప్రభుత్వాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బంద్ శాంతియుతంగా నిర్వహించినట్లు చెప్పారు. అయితే పోలీసు వారు తమను ర్యాలీ చేయకుండా ముందుకు పోనికుండా అడ్డుకున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లాలో భూసేకరణ కొరకు గజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి నిధులు కూడా మంజూరు చేశారని చెప్పారు. మరి పర్చూరు ప్రాంతం ఏం పాపం చేసిందని విమర్శించారు. నందిపాడు మండలం పాలపర్రు వరకు మొదటి పేజ్ లో నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. అదే విధంగా పాలపర్రు నుండి పర్చూరుకు 10 కిలోమీటర్ల దూరం ఉన్నా గుంటూరు ఛానల్ పొడిగించకపోవడంతో రైతులు రోడ్డెక్కారని చెప్పారు. రైతులందరూ సంఘటితంగా శాంతియుతంగా పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించేందుకు అవసరమైన భూసేకరణ కొరకు గజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని తమకు స్పష్టమైన హామీ వచ్చేవరకు నిరసన కొనసాగిస్తామని రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ గజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి భూ సేకరణ చేపడతామని స్పష్టమైన హామీ ఇస్తే తప్ప తాము దీక్షను వివరించబొమని తెలిపారు. రోడ్డుపై బైఠాయించిన రైతులకు పర్చూరు బార్ సోసియేషన్ కు చెందిన న్యాయవాదులు పూర్తి మద్దతు సంఘీభావాన్ని తెలిపారు.పోలీసు వారు రైతులతో మాట్లాడుతూ గంటల తరబడి నుండి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వారికి ఇబ్బంది కలగకుండా నిరసనను విరమించుకోవాలని పలుమార్లు రైతుల దృష్టికి తీసుకు వెళ్లినా కూడా ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో బాపట్ల డిఎస్పి చంద్రమౌళి రైతు నాయకులతో బాపట్ల ఆర్డిఓ చేత ఫోన్లో మాట్లాడించారు అయినా ఫలితం లేదు. రైతులందరూ రోడ్డుపైన కూర్చొని అల్పాహారాన్ని స్వీకరించారు. ఈ సమస్య మీపై అధికారులకు వెంటనే తెలియపరచాలని పలుమార్లు రైతులు కూడా కోరారు. బందులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ ఆధ్వర్యంలో సిఐ నాగభూషణం,ఎస్ఐ పి గోపి,ఎస్ఐ రత్నకుమారి,పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో నలమడ ప్రాంత రైతులు కోట హరిప్రసాద్, ఒగ్గిశెట్టి నరసింహారావు, ఒగ్గిశెట్టి శెట్టి గోవిందరాజులు,ఎం.జగన్నాధం, కోట శ్రీనివాసరావు, తోకల కృష్ణమోహన్, హరిబాబు, లంకా ప్రసాద్ చౌదరి లంక శివ,పర్చూరు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్