ఏలూరు : అమరుల స్ఫూర్తితో ఉద్యమించాలని ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్ లో రెండవ రోజు శనివారం ప్రారంభమయ్యాయి. మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి మాట్లాడుతూ .... రైతు ఉద్యమాల కేంద్రం ఏలూరు జిల్లాలో మహాసభలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి ఉద్దరాజు రామం ఆర్ సత్యనారాయణ రాజు వంటి అమరుల స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు అధ్యక్ష వర్గంగా వి.కృష్ణయ్య, పి.హేమలత, బి.రాంబాబు, ఎం.అప్పలరాజు వ్యవహరించారు. రెండవ రోజు సభ ప్రారంభ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు టి సూర్యనారాయణ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. (రైతు సంఘం పూర్వ నాయకులు బడా సుబ్బిరెడ్డి వైజోయ, కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య, సిపిఎం అఖిలభారత పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎమ్మెస్ స్వామినాథన్ కొడియారి బాలకృష్ణ, ఎన్ శంకరన్ మల్లు స్వరాజ్యం, సిపిఐ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, తమిళనాడు సిపిఐ పోరవ రాష్ట్ర కార్యదర్శి నల్ల కన్ను, రైతు సంఘం పూర్వ ప్రధాన కార్యదర్శి సామినేని రామారావు, మాజీ ఎమ్మెల్యే బయ్యా రెడ్డి, గగులోతు ధర్మ ప్రజా గాయకుడు గద్దర్ , ఫణిక్కర్ ప్రొఫెసర్ సాయిబాబా, మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ ఆర్ సత్యనారాయణ రాజు, రైతు నాయకులు వలవల శ్రీరామమూర్తి, కార్మిక నాయకులు చింతకాయల బాబురావు, ఎమ్మెల్సీ షేక్ షాప్ షాబ్జి, తదితరులను స్మరించుకుంటూ ... తీర్మానించి సభ కాసేపు మౌనం పాటించింది.
అమరుల స్ఫూర్తితో ఉద్యమించాలి : ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 04, 2026, 02:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)