గాజా : అక్టోబర్ 7,2023లో మొదలైన గాజాపై ఇజ్రాయిల్ దాడులు.. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. ఇజ్రాయిల్ గాజాపై జరిపిన నరమేధంలో వెయ్యి రోజుల్లో 21 వేల మంది చిన్నారులు మృతి చెందారు. ఈ విషయాన్ని శుక్రవారం స్థానిక ఆరోగ్య అధికారులు ప్రకటించారు. అలాగే గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. ప్రధానంగా తరువాతి తరం లేకుండా చేయాలనే లక్ష్యంతోనే ఇజ్రాయిల్ దాడులకు పాల్పడిందనేది స్పష్టం. ఈ నరమేధాన్ని అంతర్జాతీయ, మానవ హక్కుల పరిశీలకులు ఖండిస్తూనే ఉన్నారు.
కాగా, గాజాలో స్కూల్స్, ఆసుప్రతులు, శరణార్ధి శిబిరాలపై జరిపిన ఇజ్రాయిల్ బాంబు దాడుల వల్ల చిన్నారులు అధిక సంఖ్యలో మృతి చెందారు. ఈ ఘటనపై పాలస్తీనా అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. పాలస్తీనా దేశ భవిష్యత్తు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే పౌరుల ప్రాణాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు జరిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పాలస్తీనాపై అనేకసార్లు తీర్మానాలు చేసినప్పటికీ ఇజ్రాయిల్ ఆ మారణకాండను నిలువరించలేకపోయింది. సమర్థవంతమైన శాశ్వత కాల్పుల విరమణను అమలు చేయడంలో అంతర్జాతీయ సమాజం విఫలైమంది అని వారు అన్నారు.








కామెంట్‌లు (0)