శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గాజువాకలో ఉద్రిక్తత - ఎమ్మెల్యే ఆఫీసును ముట్టడించిన స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు

1 గంట క్రితం

గాజువాకలో ఉద్రిక్తత - ఎమ్మెల్యే ఆఫీసును ముట్టడించిన స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 03:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విశాఖ : విశాఖ గాజువాకలో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ... గాజువాక ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆఫీసును విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ముట్టడించారు. మొదట వారంతా 48 గంటల వంటావార్పుతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. ఆ నిరసనను పోలీసులు భగ్నం చేశారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ ... విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులంతా కలిసి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్యాలయానికి వెళ్లారు. నిర్వాసితులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిర్వాసితులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. నిర్వాసిత సంఘాల నేతలతో పోలీసులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వచ్చి తమ సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వాలని స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు పట్టుబట్టారు. ఎకరం భూమి లేదా వన్ టైం సెటిల్మెంట్ చేయాలంటూ ... నిర్వాసితులు డిమాండ్ చేశారు. ప్లాంట్ లో ఉద్యోగాల కేటాయింపు, భూములు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం, తదితర సమస్యలపై నిర్వాసితులు ఆందోళన తీవ్రతరం చేశారు. ఈ నిరసనలతో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్