ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : పీలేరులో మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. శనివారం పీలేరులో ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఏవిఓపిఏ) నాయకులు, సభ్యులు రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. ఆయన ప్రజాసేవ, నిజాయితీ, నిరాడంబర రాజకీయాలకు చేసిన సేవలను కొనియాడుతూ పలువురు నాయకులు స్మరించుకున్నారు. అనంతరం ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టి జయంతి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆవోప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, పీలేరు అధ్యక్షుడు పెంజూరి అశోక్, బాలసుబ్రహ్మణ్యం, మల్లి, మాదాలం సీనా, విజయ మహేష్, సురేష్, రేవూరి నాగరాజు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బలసా వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా మువ్వల నరసింహులు శెట్టి, వినోద్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరై రోశయ్యకు ఘనంగా నివాళులు అర్పించారు.
పీలేరులో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి వేడుక
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 04, 2026, 04:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)