ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం
విద్యార్దుల నుంచి విశేష స్పందన
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : భారత్ విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శ్రీ చైతన్య డిగ్రీ & పీజీ కళాశాలలో రక్తదాన శిబిరం శనివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ అధ్యక్షులు సూరిబాబు వంశీ మాట్లాడుతూ " అల్లూరి సీతారామరాజు గొప్ప స్వాతంత్ర సమరయోధుడు అని, భారత దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేశాడని అన్నారు. అడవిలో ఉండే ఆదివాసులకు సైతం ధైర్యాన్ని ఇచ్చి బాణాలు విల్లంబులతోనే గెరిల్లా పోరాటం చేసి బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించారని అన్నారు. బ్రిటిష్ వాడి బుల్లెట్లకు చాతిని ఎదురొడ్డి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని కొనియాడారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి సంవత్సరం ఆయన జయంతి నాడు బ్లడ్ నేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నామని చెప్పారు. వీలైనంతమంది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొని ప్రాణదాతలు కావాలని అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎదుటివారి ప్రాణాలను కాపాడడమే కాకుండా మనలో కూడా కొత్త బ్లడ్ సెల్స్ వచ్చి చిన్న చిన్న రోగాలు నయమవుతాయని అన్నారు. అల్లూరి సీతారామరాజు ఇచ్చిన స్ఫూర్తితో ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగే విద్యార్థుల కోసం న్యాయ పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఉపాధ్యక్షులు జయ, భారతి; టౌన్ కమిటీ సభ్యులు మహేష్, మురళి పాల్గొన్నారు








కామెంట్‌లు (0)