మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి - పులివెందుల టౌన్, వేముల : వచ్చేది తమ ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసానిచ్చారు. కార్యకర్తల సంక్షేమమే తన తొలి కర్తవ్యమన్నారు. రెండో రోజుల పర్యటనలో భాగంగా పులివెందులలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. టిడిపి కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని, కూటమి నాయకులు దాడులు చేస్తున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని పలువురు వైసిపి నేతలు, కార్యకర్తలు జగన్ వద్ద వాపోయారు. టిడిపి కూటమి నాయకుల అరాచకాలతో నష్టపోయిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం వేముల మండలంలో విస్తృతంగా పర్యటించారు. గట్టు శ్రీ నరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం ఉదయం పులివెందుల నుంచి తిరిగి బెంగళూరుకు వెళ్లనున్నారు.









కామెంట్‌లు (0)