శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘వెలిగొండ’ ట్రయల్ రన్ వాయిదా!

1 గంట క్రితం

veligonda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 12:13 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - మార్కాపురం : పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్ వాయిదా పడినట్లు సమాచారం. ఈ నెల 22న ట్రయల్ రన్ నిర్వహించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు సొరంగ మార్గంలో ఈ నెల 17న జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందారు. దీంతో, మూడు రోజుల పాటు పనులు నిలిచిపోవడంతో చిన్నచిన్న పనులు పెండింగ్‌ ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో సొరంగ మార్గంలో టన్నల్ బోర్ మిషన్ చిక్కుకుపోయింది. దీని తొలగింపు పనులు కూడా రెండు లేదా మూడు రోజుల్లో పూర్తవుతాయని అధికారులు చెప్తున్నారు. వెలిగొండ సొరంగ మార్గాల నుండి కృష్ణా జలాలను నల్లమల జలాశయానికి సరఫరా చేసే ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులు కూడా ఒకటి రెండు రోజుల్లోనే పూర్తి కానున్నాయని అంటున్నారు. పనులు పెండింగ్‌ ‌వల్ల ట్రయల్‌ ‌రన్‌ ‌వాయిదా పడినట్లు సమాచారం. 27న ట్రయల్ రన్ నిర్వహించి 31న ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉండే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. పరిహారం, ఇతర సమస్యలు పరిష్కరించకుండానే ప్రభుత్వం ట్రయల్‌ ‌రన్‌‌కు సిద్ధం కావడం పట్ల నిర్వాసితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, గ్రామాలను ఖాళీ చేయడానికి సమయం ఇవ్వాలని, పునరావాస కాలనీల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుసాయాలు కల్పించాలని వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్