- ఒకరు మృతి
ప్రజాశక్తి - మధురవాడ (విశాఖపట్నం) : విశాఖ జిల్లా రుషికొండ ఐటి సెజ్ సమీపాన రుషికొండ బీచ్‌లో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి నార్త్ జోన్ ఎసిపి అప్పలరాజు కథనం మేరకు.. గాంధీ జయంతి రోజున పాఠశాలలకు సెలవు కావడంతో మల్లయ్య పాలెం, వాంబే కాలనీలకు చెందిన ఆరుగురు విద్యార్థులు బీచ్‌కు వచ్చారు. వారిలో తొమ్మిదో తరగతి చదువుతున్న పి.ప్రశాంత్(14), ఎస్.సూర్యప్రకాష్, ఎస్.నీలేష్ సహా మరో ముగ్గురు ఈత కోసం సముద్రంలోకి దిగారు. అలల తాకిడికి వారందరూ కొట్టుకుపోయారు. హేమంత్, ప్రసాద్, తారేష్‌లను స్థానికులు రక్షించారు. సమాచారం అందుకున్న నార్త్ సబ్ డివిజన్ ఎసిపి అప్పలరాజు, పిఎం.పాలెం సిఐ బాలకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లైఫ్ గార్డ్‌లు, పోలీసులు, నేవీ హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రానికి ప్రశాంత్ మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది.ఎస్.సూర్యప్రకాష్, ఎస్.నీలేష్‌ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.







కామెంట్‌లు (0)