ప్రజాశక్తి - యంత్రాంగం : విశాఖ, నెల్లూరు, అనకాపల్లి, కర్నూలు, నంద్యాలలో నగర, కార్పొరేషన్, మున్సిపల్ స్థానాలకు పలువురు సిపిఎం అభ్యర్థులు నామినేషన్ వేశారు. నామినేషన్ సందర్భంగా సిపిఎం నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. దీంతో కోలాహలం నెలకొంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి)లో 7వ వార్డు అభ్యర్థిగా బల్లంకి భారతి, 13వ వార్డు నుంచి సంగరెడ్డి గౌరి, 16వ వార్డు నుంచి శీరెడ్డి రంగమ్మ, 105వ వార్డు నుంచి ఎం.కృష్ణయ్య, 106వ వార్డు అభ్యర్థిగా బొద్దపు శ్రీనివాసరావు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాల్టీకి సంబంధించి 16వ వార్డు అభ్యర్థిగా కెవి.సూర్యప్రభ నామినేషన్ వేశారు. నెల్లూరు నగరపాలక సంస్థలో 70 వ డివిజన్కు కత్తి శ్రీనివాసులు, 72వ డివిజన్కు గజ్జె పరమేశ్వరి నామినేషన్లు వేశారు. కర్నూలు నగరపాలక సంస్థ 2వ వార్డు అభ్యర్థిగా సి. జయమ్మ, 20వ వార్డు అభ్యర్థిగా బంగి పద్మావతి, 22వ వార్డు అభ్యర్థిగా ఎం. నాగమ్మ, 23వ వార్డు అభ్యర్థిగా ఎం. విజయ రామాంజనేయులు, 42వ వార్డు అభ్యర్థిగా జి. ధనలక్ష్మి, 59వ వార్డు అభ్యర్థిగా ఎం. కుమారి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం 28వ వార్డు అభ్యర్థి ఆర్. నళిని నామినేషన్ వేశారు. నంద్యాల జిల్లా డోన్ మున్సిపల్ చైర్పర్సన్గాగా నక్కి లావణ్య నామినేషన్ వేశారు.











కామెంట్లు (0)