శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

YCP: రాష్ట్రంలో ఆటవిక రాజ్యం

2 రోజుల క్రితం

vzm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 07:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వైసిపి శాసనమండలి ప్రతి పక్ష పార్టీ నేత బొత్స సత్యనారాయణ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం దురదృష్టకరమని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం సాయంత్రం విజయనగరం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిష్పక్షపాతంగా, స్వేచ్చగా, నిర్బయంగా జరగాల్సిన ఎన్నికలను అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందుతుందని ఆరోపించారు. సాక్ష్యాత్తు దేశం . అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న తీరును తప్పుపడుతూ జోక్యం చేసుకోవటం చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. చంద్రబాబు తన అనుభవం, రాజకీయాలను దేశ వ్యాప్తంగా ప్రజలంతా చూస్తున్నారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు, కూటమి నేతలకు కనువిప్పు కలిగించే తీర్పునిచ్చిందని తెలిపారు. న్యాయ స్థానం ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ. నిర్వహించాలని డిమాండ్ చేశారు. వెన్నుపోటు పార్టీ చేస్తున్న దుర్మార్గాలను మేధావులు, విద్యావంతులు ఆలోచించి స్థానిక సంస్థల ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని ఆకాంక్షించారు. విలేకర్ల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ సురేష్బాబు లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్