గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వర్షాలకు విద్యుత్‌ వైరు తెగిపడి మహిళ మృతి

1 గంట క్రితం

death.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 01:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మోపిదేవి: కృష్ణాజిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి గ్రామంలో గురువారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. ఈదురుగాలు, వర్షాలకు విద్యుత్‌ వైర్లు తెగిపడి దారపురెడ్డి సామ్రాజ్యం మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సామ్రాజ్యం మృతిపై సిపిఎం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపింది. వర్షాల కారణంగా విద్యుత్‌ వైరు తెగిపడి జరిగిన ప్రమాదంలో మృతి చెందిన సామ్రాజ్యం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. బాధిత కుటుంబానికి తక్షణం ఆర్థిక సహాయం ప్రకటించాలని కోరింది.సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం కృష్ణాజిల్లా కార్యవర్గ సభ్యులు శీలం నారాయణరావు, మోపిదేవి మండల కార్యదర్శి చిరివెళ్ల రాజశేఖర్‌ విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్