గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చందర్లపాడు మండలంలో ప్రత్యేక అధికారి పర్యటన

1 గంట క్రితం

ntr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 02:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

– తుఫాను, వరదలపై ముందస్తు చర్యలు:

ప్రజాశక్తి-చందర్లపాడు: చందర్లపాడు మండల పరిషత్‌కు ప్రత్యేక అధికారిగా నియమితులైన NTR జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి ఎల్. చంద్రకళ గురువారం ఉదయం చందర్లపాడు ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి శ్రీమతి ఎల్. చంద్రకళ పలు ప్రాంతాలను పరిశీలించారు. ముఖ్యంగా తర్లపాడు–ముప్పాళ్ల గ్రామాల మధ్య ఉన్న సప్టాను పరిశీలించి, వరద ఉద్ధృతి అధికంగా ఉంటే ముందస్తుగా వాహనాల రాకపోకలను నిలిపివేయాలని, అవసరమైతే పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని ఎంపీడీవో శ్రీమతి పద్మ జ్యోతికి సూచించారు. అదేవిధంగా, విద్యార్థుల భద్రత దృష్ట్యా తల్లిదండ్రులు తమ పిల్లలను అత్యవసరమైతేనే బయటకు పంపేలా చర్యలు తీసుకునేలా పాఠశాలల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. వరదల సమయంలో విద్యుత్ తీగలు తెగి పడే అవకాశం ఉన్నందున విద్యార్థులు బయట తిరగకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే, శిథిలావస్థలో ఉన్న లేదా కూలిపోయే అవకాశం ఉన్న ఇళ్లలో ప్రజలు ఉండకుండా, సురక్షితమైన ప్రదేశాలకు తరలివెళ్లేలా తగిన సూచనలు ఇవ్వాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీమతి పద్మ జ్యోతి,ముప్పాళ్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం సాయిరాం,వీఆర్వో శ్రీ బాబురావు,తర్లపాడు పంచాయతీ కార్యదర్శి శ్రీమతి మాణిక్యమ్మ మరియు కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్