ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జూన్‌ 30 నాటికి రోల్‌‌ ప్రకారమే పని సర్దుబాటు

28 జూన్, 2026

utf
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 10:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఉపాధ్యాయుల పనిసర్దుబాటుపై యుటిఎఫ్‌ డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ​ఉపాధ్యాయుల పని సర్దుబాటును జూన్‌ 30‌వ తేది నాటికి ఉన్న రోల్‌‌నే పరిగణలోకి తీసుకోవాలని యుటిఎఫ్‌ ‌రాష్ట్రకమిటీ డిమాండ్‌ ‌చేసింది. ఈ ప్రకారం అయితే క్షేత్రస్థాయిలో ఇబ్బంది ఉండదని, ఆ ప్రకారం నిబంధనలు సవరణ చేయాలని ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్ఎస్ ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. జూన్‌ 30వ తేదిని పరిగణలోకి తీసుకుంటే ఉపాధ్యాయ పోస్టులకు, విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని తాము పాఠశాల విద్య కమిషనర్‌ ‌కార్యాలయానికి ప్రతిపాదించామని పేర్కొన్నారు. కానీ వెంటనే పని సర్దుబాటు చేసి ఉపాధ్యాయులు నియమించాలనే ఆలోచనతో జూన్ 20ని పరిగణిస్తున్నామని అధికారులు చెబుతున్నారని తెలిపారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వివరించారు.

ఉపాధ్యాయుల పని సర్దుబాటు పేరుతో ప్రస్తుతం పని చేస్తున్న పోస్టులకు ఎలాంటి ఇబ్బందిలు కల్పించొద్దని కోరారు. అవసరమైన పాఠశాలలలో పోస్టుల దగ్గర మాత్రమే అదనపు పోస్టులు వేరే పాఠశాల నుంచి వేసే ప్రయత్నం మాత్రమే చేయాలని డిమాండ్ చేశారు. మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో 60 వద్ద పిఎస్ హెచ్ఎం, నాలుగు ఎస్జిటిలు, 130 దగ్గర కూడా నాలుగు ఎస్జిటిలు మాత్రమే ఉంచి ఇప్పటికే పని చేస్తున్న ఒక ఎస్జిటిని తొలగించటం అన్యాయమని పేర్కొన్నారు. వీటిని యధాతధంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.పని సర్దుబాటు పేరుతో రేషనలైజేషన్‌ ‌పద్ధతిలో విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు ఇవ్వటం సరికాదని తెలిపారు. పని సర్దుబాటు అవసరమైన చోట మాత్రమే సర్దుబాటు చేస్తూ మిగిలిన పోస్టులను అవసరమైతే విద్య ఇన్‌‌స్ర్టక్షర్లను ఇచ్చేదాని కోసం ప్రయత్నం చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందుల్ని గమనించి, నిబంధనలను సవరణ చేసి జూన్ 30నాటి రోల్ ఆధారంగా వర్క్ అడ్జస్ట్మెంట్ నిబంధన రూపొందించి అమలు చేయాలని కోరారు. ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకునే దానికోసం అడ్మిషన్స్ ప్రక్రియలో ఉన్న ఇబ్బందులను తక్షణం తొలగించాలని కోరారు. ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకారం జులై 5వ తేదిలోపు అన్ని స్థాయిల్లోనూ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వాలని, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు వెంటనే ప్రమోషన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్