సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మెగా డీఎస్సీ అవకతవకలపై వైసీపీ నిరసన..

1 గంట క్రితం

ycp 1.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:11 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • విజయవాడలో ఉద్రిక్తత

ప్రజాశక్తి – విజయవాడ: మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి చేపట్టిన నిరసన విజయవాడలో ఉద్రిక్తంగా మారింది. విజయవాడ లబ్బీపేటలోని శాప్‌ కార్యాలయం ముట్టడికి వైసిపి నేతలు, కార్యకర్తలు తరలిరాగా పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకు అనుమతి లేదని, ఎవరూ రావొద్దని పోలీసులు ముందుగానే నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ శాప్‌ కార్యాలయం ముట్టడికి వచ్చిన వైసీపీ నేతలను పోలీసులు నిలువరించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వైసీపీ నేత దేవినేని అవినాష్‌తో పాటు పలువురు నాయకులు నిరసనలో పాల్గొన్నారు. శాప్‌ కార్యాలయం వైపు వెళ్లే మార్గాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన వైసీపీ నేతలు.. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటాలో ఎవరెవరికి అక్రమంగా సర్టిఫికెట్లు జారీ చేశారో విచారణ ద్వారా వెలుగులోకి తీసుకురావాలని వైసిపి నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. మచిలీపట్నంలోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ పలువురు వైసీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేసినట్లు సమాచారం.

ycp 4.jpeg

ycp 3.jpeg

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్