ప్రజాశక్తి-ప్రకాశం : వైసిపి రాష్ట్ర ప్రచార అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం ఒంగోలుకు తరలించనున్నట్లు పేర్కొన్నారు. రాజశేఖర్ మృతికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరు రవిబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మృతి నేపథ్యంలో గురువారం జరగాల్సిన పార్టీ విస్తృత సమావేశాన్ని వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
వైసిపి రాష్ట్ర ప్రచార అధ్యక్షుడు రాజశేఖర్ మృతి
42 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 10:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)