ప్రజాశక్తి–కురుపాం: తుఫాను ప్రభావంతో కురుపాం మండలం నీలకంఠాపురం–ధర్మలక్ష్మీపురం గ్రామాల మధ్య శిరిడీ సాయిబాబా ఆలయం సమీపంలో గురువారం ఉదయం భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే నీలకంఠాపురం ఎస్‌ఐ పి. రమేష్‌నాయుడు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెట్లను తొలగించే యంత్రం సహాయంతో చెట్టును ముక్కలుగా కట్ చేసి, పోలీసు సిబ్బంది, గ్రామస్తుల సహకారంతో రోడ్డు పక్కకు పూర్తిగా తొలగించారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
రోడ్డుకు అడ్డంగా పడిన భారీ చెట్టు తొలగింపు
45 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 10:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)