ప్రజాశక్తి–ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు చిరుజల్లులు కురవగా, బుధవారం రాత్రి నుంచి వర్షం జోరందుకుంది. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం గురువారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది.జిల్లాలో గురువారం ఉదయం వరకు సగటున 85.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా తణుకులో 116.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా అత్తిలిలో 38.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ఆవాసాల చుట్టూ వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు ప్రాంతాల ప్రజలు చీకట్లోనే ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
వీడని వర్షం.. విద్యుత్‌కు అంతరాయం
48 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 10:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)