ప్రజాశక్తి–యు.కొత్తపల్లి: భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా గోర్స నుంచి ఆనందనగర్ వెళ్లే మార్గంలో చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్‌అండ్‌బీ, పోలీసు శాఖల సిబ్బంది వెంటనే స్పందించి చెట్టును తొలగించారు. దీంతో రాకపోకలకు అంతరాయం తొలగింది. అలాగే గోర్స జంక్షన్‌లో మరో చెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడింది. దీంతో ఆర్‌అండ్‌బీ, విద్యుత్ శాఖల సిబ్బంది సమన్వయంతో చెట్టును తొలగించే పనులు చేపట్టారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగానే చెట్లు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు.
రోడ్డుకు అడ్డంగా విరిగిన చెట్టు తొలగింపు
50 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 10:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)