గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య

1 గంట క్రితం

youtuber vaishnavi.jpg.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 09:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త చిథారి హరిబాబు నిజామాబాద్‌లో దారుణంగా హత్యకు గురయ్యాడు. నిజామాబాద్ ఆర్‌ ఆర్‌ సెంటర్‌లో గుర్తుతెలియని ఒక యువకుడు కొబ్బరి కాయలు కోసే కత్తితో హరిబాబుపై దాడి చేసి ప్రాణాలు తీశాడు. జగిత్యాల జిల్లాకు చెందిన యూట్యూబర్ వైష్ణవిని ('వైషు అమ్మ' ఛానెల్) అదనపు కట్నం వేధింపుల కారణంగా ఈ ఏడాది మార్చి 17న హరిబాబు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ కేసులో అతడు అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు హరిబాబును అదే రోజు కోరుట్ల శివారులో అదపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అలాగే వేధింపులకు సంబంధించి అతని కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేగింది. హరిబాబు హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్