బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్‌ జగన్‌ నివాళులు

1 గంట క్రితం

ys jagan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 09:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇడుపులపాయ: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన భార్య విజయమ్మ, తనయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. బుధవారం ఉదయం ఘాట్‌ వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్సార్‌ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ ఆశయాలను సాధిస్తామని పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్