శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రావణ్‌కు అండగా వైసిపి

10 జులై, 2026

kilimi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 10:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- టిడిపి ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు

మంగళగిరి: చట్టాల్ని అపహాస్యం చేస్తూ, ప్రశ్న రావణ్‌కు అండగా వైసిపి అధినేత వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఆయన బృందం అనుసరిస్తోందని టిడిపి ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు ధ్వజమెత్తారు. టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై గౌరవం లేకుండా మాట్లాడేవారిని సమర్థించడం వైసిపి దిగుజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయని ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌‌షాలే స్వయంగా చెప్పారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 12 పథకాల ద్వారా రూ.1,17000కోట్లకు పైగా సంక్షేమాన్ని అందించామని బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్‌ నీలాయపాలెం విజయ్‌కుమార్‌ మరో సమావేశంలో అన్నారు. రూపాయి అవినీతి లేకుండా అమలు చేశామని చెప్పారు. పెన్షన్ల కోసమే రూ.68,194కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

గత పాలకుల దోపిడీ పాలనకు, నేటి కూటమి ప్రభుత్వ అభివృద్ధి పాలనకు మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. పరిశ్రమల స్థాపన ముసుగులో వందల, వేల ఎకరాల ప్రభుత్వ భూములను, ప్రజల ఆస్తులను తనకు కావాల్సిన కంపెనీలకు వైఎస్‌ ‌జగన్‌ దారాదత్తం చేశారని విమర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్